జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు
- January 21, 2025
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్న్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగినట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే.
అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఇలాంటి చట్టం అమల్లో ఉన్నట్టు పొరపాటుగా పేర్కొనడం గమనార్హం. పారిస్ వాతావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం మేర సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. హెచ్ 1బీ వీసాలపై (H1B Visas) ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.
కాగా, అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్దుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే. అయితే, ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం