అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా టీజర్ రిలీజ్
- June 29, 2016
అల్లు వారి ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ తర్వాత హీరోగా ఎంటీ ఇచ్చిన కుర్రాడు అల్లు శిరీష్.. మెగా సపోర్ట్ ఉన్నా లేకున్నా తన సత్తా చాటుతున్న అల్లు అర్జున్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి శిరీష్ చేసిన రెండు సినిమాలు అంతగా ప్రభావితం చూపలేదు. అయితే ఈసారి శ్రీరస్తు శుభమస్తు అని వస్తున్న శిరీష్ కన్ఫాం హిట్ అనేస్తున్నాడు.
పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. గౌరవం, కొత్తజంట సినిమాల్లో కనిపించిన దాని కన్నా శ్రీరస్తు శుభమస్తులో శిరీష్ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఇక కొద్ది గంటల క్రితమే ఈ సినిమా ట్రైలర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు శిరీష్. జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదు అంటూ శిరీష్ చెప్పే డైలాగ్ మెగా అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది.
మెగా సపోర్ట్ తో నిన్న మొన్న వచ్చిన సాయి ధరం తేజ్ సుప్రీం హీరోగా దూసుకెళ్తున్నాడు. మరి శిరీష్ ఎకౌంట్ లో రాబోయే మొదటి హిట్ ఇదైనా అవుతుందా లేదా అన్నది చూడాలి. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పరశురాం ఎంతో కసితో డైరెక్ట్ చేశాడు. అల్లు బ్యానర్లో తన టాలెంట్ చూపిస్తే అది మళ్లీ మరెన్నో అవకాశాలను తెస్తుందని దర్శకుడు బుజ్జి ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు.
ఇక సినిమాను మ్యూజిక్ థమన్ అందించాడు.. టీజర్ లో మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సో మొత్తానికి అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లి బాజా మోగిస్తున్నాడన్నమాట.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







