బీజేపీ ఏపీ జిల్లా అధ్యక్షులు వీరే...
- January 22, 2025
విజయవాడ: బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను బీజేపీ నిర్వహించింది.
.మొత్తంగా 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికైన వారికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగాయని తెలిపారు. నేతలు ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఏపీకి కేంద్రం అన్నివిధాలా సాయం అందిస్తోందని చెప్పారు. గత ఐదేళ్లు పోలవరంలో చిటికెడు మట్టి కూడా వేయలేదన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఏపీ బీజేపీ జిల్లాల అధ్యక్షులు వీరే..పార్వతీపురం మన్యం జిల్లా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు , అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు)మఠం శాంతకుమారి శ్రీకాకుళం జిల్లా సిరిపురం తేజేశ్వరావు. విజయనగరం జిల్లా ఉప్పలపాటి రాజేష్ వర్మ విశాఖపట్నం జిల్లా మంతెన పరుశురాంరాజు,, అనకాపల్లి జిల్లా. ద్వారపురెడ్డి పరమేశ్వర రావు,. కాకినాడ జిల్లా బిక్కిన విశ్వేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అడబాల సత్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా. పిక్కి నాగేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా ఐనంపూడి శ్రీదేవి, ఏలూరు జిల్లా చౌటపల్లి విక్రమ్ కిషోర్. ఎన్టీఆర్ జిల్లా. అడ్డూరి శ్రీరాములు . గుంటూరు జిల్లా. చెరుకూరి తిరుపతిరావు. పల్నాడుజిల్లా. ఏలూరి వెంకట మారుతి శశి కుమార్, ఒంగోలు జిల్లా సెగ్గం శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా పారెడ్డి వంశీధర్ రెడ్డి. తిరుపతి జిల్లా సామంచి శ్రీనివాసరావు. అన్నమయ్య జిల్లా వసంత సాయి లోకేష్, చిత్తూరు జిల్లా సూరపనేని జగదీశ్వర్ నాయుడు, కడప జిల్లా. జంగిటి వెంకట సుబ్బారెడ్డి. సత్యసాయి జిల్లా. గోరంట్ల మోహన్ శేఖర్, . అనంత పూర్ జిల్లా కొనకొండ్ల రాజేష్, కర్నూలు జిల్లా. బాపురం రామకృష్ణ పరమహంస. నంద్యాల జిల్లా అభిరుచి మధు
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







