ఐఎస్ ఆటకట్టిస్తామని ఒబామా ..
- June 29, 2016
ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న ఇస్లామిక్ స్టేట్లాంటి ఉగ్రవాద సంస్థలను అంతమొందించే వరకు నిద్రపోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఇస్తాంబుల్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. టర్కీతోపాటు నాటో దళాలతో కలిసి పనిచేస్తామని, ఉగ్రవాదుల పీచమణిచే వరకు విశ్రమించబోమని ఆయన అన్నారు. తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడిన ఒబామా.. ఉగ్ర దాడుల్లో మరణించిన 41 మందికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో టర్కీకి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. నాగరిక ప్రపంచంపై ద్వేషాన్ని పెంచుకొని విషం చిమ్ముతున్న ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థలు ఎంతోమంది అమాయకులను బలి చేస్తున్నారని, నాటోతో కలిసి వారి ఆటకట్టిస్తామని ఒబామా స్పష్టంచేశారు. వాళ్లు ఆక్రమించుకున్న సిరియా, ఇరాక్లలోనూ వాళ్ల పీఠాలు కదులుతున్నాయని, ఆ రెండు దేశాల్లోనూ వారిని ఓడిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







