ఐఎస్ఐఎస్ కు భారీ ఎదురుదెబ్బ
- June 30, 2016
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇరాక్ లో జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఫల్లూజ పట్టణంలో జరిపిన వైమనిక దాడుల్లో 250 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 40 వాహనాలను ధ్వంసం అయినట్లు 'రాయిటర్స్' వెల్లడించింది.ఫల్లూజ ప్రాంతంలోని సామాన్య ప్రజానికాన్ని ముందుగానే వేరే ప్రాంతాలకు తరలించి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది కేవలం ప్రాధమిక అంచనా మాత్రమే అని మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







