యూఏఈలో డ్రైవర్‌లెస్ ఫ్లయ్యింగ్ పాడ్స్
- June 30, 2016
డ్రైవర్‌లెస్ కార్లే కాదు, డ్రైవర్‌లెస్ ఫ్లయ్యింగ్ కార్లు కూడా యూఏఈ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. డ్రైవర్‌లెస్ హోవర్ జెట్స్‌ని యాస్ ఐలాండ్ రోడ్ల మీదుగా, ప్రయాణీకులకు సౌకర్యాలు అందించనున్నట్లు అబుదాబీ వెల్లడించింది.యాస్ ఐలాండ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపడుతున్న సంస్థ మిరాల్, స్కైట్రాన్ ఐఎన్‌సితో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పిఆర్టి) సిస్టమ్ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మిడిల్ ఈస&్టలో ఇదే తొలిసారి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సన్నాహాలు ప్రారంభించడం. స్కైట్రాన్, కంప్యూటర్ కంట్రోల్లో నడిచే ఇద్దరు ప్రయాణీకులకు సేవలందించే 'జెట్ లైక్' వెహికిల్ అని మిరాల్ సంస్థ వెల్లడించింది. సెల్ఫ్ డ్రైవింగ్ మోనో రైల్ తరహాలో ఈ సరికొత్త ప్రయాణ మార్గాన్ని డెవలప్ చేస్తున్నారు. రోడ్డుపై 20 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేస్తారు. వేగంగా, అతి తక్కువ ఖర్చుతో ఎలివేటెడ్ పిఆర్టి అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండనుంది. అలాగే, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది కూడా. స్మార్ట్ సిటీలకు అనువైన స్మార్ట్ ప్రయాణానికి ఈ స్కైట్రాన్ ఉపయోగపడుతుందని స్కైట్రాన్ సిఇఓ జెర్రీ సాండర్స్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







