ఫర్వానియా గవర్నరేట్ లో 4,540 కార్లు స్వాధీనం..!!

- January 24, 2025 , by Maagulf
ఫర్వానియా గవర్నరేట్ లో 4,540 కార్లు స్వాధీనం..!!

కువైట్: 2024లో ఫర్వానియా గవర్నరేట్‌లో 4,540 నిర్లక్ష్యంగా వదిలేసిన కార్లను తొలగించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు మునిసిపాలిటీ ఇంప్పౌండ్‌మెంట్ సైట్‌కు తరలించారు. ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ బ్రాంచ్‌లోని జనరల్ క్లీనింగ్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ అల్-జబా మాట్లాడుతూ.. గత సంవత్సరంలో డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు చేసిన ఫీల్డ్ క్యాంపెయిన్‌ల ఫలితంగా 4,540 పాడుబడిన, స్క్రాప్ కార్లను తొలగించినట్టు తెలిపారు.  అదే సమయంలో రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేసిన కార్లకు 17,952 స్టిక్కర్లను ,  2,932 ప్లడ్జేస్, 3,565 హెచ్చరికలను జారీ చేసినట్టు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com