ఫిబ్రవరి 4న రథ సప్తమి..ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలు రద్దు..
- January 24, 2025
తిరుమల: ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్ర వారం అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు.
భక్తులకు అన్నప్రసాదం,తాగునీరు పంపిణీ, నిఘా,భద్రత,శ్రీవారి సేవకులు, పుష్పాలంకరణ ,విద్యుత్ అలంకరణలు,ఇంజనీరింగ్ పనులు తదితర అంశాల పై శాఖల వారీగా ఈవో సమీక్షించారు.
భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు.గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను టిటిడి ఈవో పరిశీలించారు.
కొన్ని ముఖ్యాంశాలు:
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు.ప్రతి సంవత్సరం శుక్ల పక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
వాహనం వివరాలు:
ఉ. 5.30–8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM)–సూర్య ప్రభ వాహనం
ఉ. 9–10 గంటల వరకు–చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు–గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు–హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు–చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు–కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు–సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు–చంద్రప్రభ వాహనం
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









