హైదరాబాద్: యువ గాయకులతో హుషారు పాటలు

- January 24, 2025 , by Maagulf
హైదరాబాద్: యువ గాయకులతో హుషారు పాటలు

హైదరాబాద్: హైదరాబాద్లో శ్రీ రాగ భైరవి సంస్థ నిర్వహణలో శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై యువ గాయనీ గాయకులు నేటి సినిమా పాటలను పాడి శ్రోతలకు హుషారు కలిగించారు.విఖ్యాత గాయకుడు డాక్టర్ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం సహా గాయణులతో కలసి పాడిన పాటలను యువ గాయకులు ఉత్సాహంగా పాడి చలి వాతావరణంలో వేడి పుట్టించారు.కామేష్ మాంధా,చంద్ర మౌళి,మనోజ్ భరత్ రాము దిలావర్ ఇందు నయన అనుపమ ఆనంది చంద్రిక స్వప్న తదితరులు పాటల విందు చేశారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు పాల్గొని మాట్లాడుతూ...బాలసుబ్రహ్మణ్యం తో తమ సంస్థకు వున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు గాన సభ కు బాలు ఎన్నోసార్లు వచ్చారని గుర్తు చేసుకున్నారు.ఘంటసాల తరువాత అంతటి కీర్తి సంపాదించుకున్న నేపథ్య గాయకుడు బాలు అన్నారు శ్రీ రాగభైరవి సంస్థలో పాడిన యువ గాయని గాయకులకు మంచి భవిష్యత్ వుంటుందని కామేష్ నిర్వహణలో అరుదుగా కనిపించే గాయనీ గాయకులు పాలు పంచుకొవటం విశేషం అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com