తిరుపతి ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి పరిహారం చెల్లింపు
- January 24, 2025
తిరుపతి: తిరుపతిలో జనవరి 8వ తేదీ జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు శుక్రవారం అందజేశారు.
పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్,రామ్మూర్తి,శాంతారాం,కృష్ణమూర్తి అందజేశారు.
టిటిడి పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు.
బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టిటిడి బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







