తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
- January 25, 2025
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు.జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ ఇ తిరుమలదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం చేయించారు.
ఇంతకు ముందు రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ నర్సింగ్ రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా, బీఆర్ మధుసూదన్ రావు హైకోర్టు రిజిస్ట్రార్(పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది సేవలందిస్తున్నారు. ఈ నలుగురి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







