2024 పర్యాటక నామ సంవత్సరం.. 10 మిలియన్ హోటల్ రూమ్ బుకింగ్స్..!!
- January 26, 2025
దోహా, ఖతార్: ఖతార్ టూరిజం 2024 వార్షిక పనితీరు నివేదిక ప్రకారం.. ఖతార్ హోటల్ రంగం 2024లో 10 మిలియన్ రూమ్ బుకింగ్స్ అయ్యాయి. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం హోటల్ ఫీల్డ్ 2024 చివరి నాటికి 40,405 రూమ్ లకు చేరుకుంది. అన్ని వసతి విభాగాలలో సగటు పూర్తి ఆక్యుపెన్సీ రేటు 2023తో పోలిస్తే 19 శాతం పెరిగి 69 శాతానికి చేరుకుంది. ప్రీమియం స్టే కోసం కొనసాగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ ఫైవ్ స్టార్, హోటల్ అపార్ట్మెంట్ కేటగిరీలలో అత్యధిక ఆక్యుపెన్సీ రేట్లు నమోదయ్యాయి. ఫోర్-స్టార్ హోటళ్లు, హోటల్ అపార్ట్మెంట్లలో (డీలక్స్, స్టాండర్డ్) ఆక్యుపెన్సీ రేట్లు కూడా 2023తో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు సగటు ఆక్యుపెన్సీ రేటు 63.7 శాతం సాధించగా, ఫోర్ స్టార్ హోటళ్లు 69 శాతం నమోదు చేయగా, 3-1 స్టార్ హోటళ్లు 70.2 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించాయి. మరోవైపు హోటల్ అపార్ట్మెంట్లు 74.6 శాతం ఆక్యుపెన్సీకి చేరుకున్నాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్లలో ఆక్యుపెన్సీ రేట్లు గరిష్టంగా 85 శాతానికి చేరుకున్నాయి. ఖతార్ టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు 2024 ఒక మైలురాయి సంవత్సరంగా నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సందర్శకుల రాకపోకలలో ఐదు మిలియన్ల (5.08 మిలియన్లు) మార్కును అధిగమించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరుగుదల నమోదైంది.
GCC (41 శాతం) అంతర్జాతీయ సందర్శకుల అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. యూరప్ (23 శాతం), ఆసియా , ఓషియానియా (20 శాతం), ఇతర అరబ్ దేశాలు (ఎనిమిది శాతం), అమెరికాస్ (ఆరు శాతం) ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలు కనీసం రెండు శాంతంగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







