కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!

- January 26, 2025 , by Maagulf
కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!

కువైట్: కువైట్ కు చెందిన యోగా ప్రాక్టిషనర్ షైఖా AJ అల్ సబాహ్ కు ఇండియా మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రకటించారు. పద్మ అవార్డులు అందుకోనున్న మొత్తం 30 మందిలో ఆమె ఒకరు. కువైట్‌లో మొదటి లైసెన్స్ పొందిన యోగా స్టూడియో అయిన దరత్మాను స్థాపించిన 48 ఏళ్ల యోగా అభ్యాసకురాలు షైఖాకు యోగా పట్ల ఆమె చేసిన కృషికి భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె ప్రత్యేకమైన సాంప్రదాయ పద్ధతులతో గల్ఫ్ ప్రాంతంలో యోగాభ్యాసాన్ని ప్రోత్సహించింది. ఆమె 2021లో యోమ్నాక్ లిల్ యమన్‌కు నాయకత్వం వహించింది. యెమెన్ శరణార్థులు, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో నిరాశ్రయులైన ప్రజల కోసం నిధుల సేకరణలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. డిసెంబరులో కువైట్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం షైఖాకు దక్కింది. 

ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సోషల్ వర్క్, మెడిసిన్, లిటరేచర్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ మొదలైన వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com