బుమ్రా, స్మృతి మందానాలకు ఐసిసి అవార్డులు
- January 27, 2025
దుబాయ్: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ను ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. భారత మహిళా బ్యాటర్ స్మృతి మందానా కు 024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.అంతర్జాతీయ క్రికెట్ మండలి నేడు ఈ అవార్డులను ప్రకటించింది.. స్వదేశీతో పాటు విదేశీ పిచ్‌లపై .. 20204లో బుమ్రా సత్తా చాటాడు.తన స్పీడ్ బౌలింగ్‌తో భారత్‌కు కీలక విజయాలను అందించాడు. 2024లో అతను 13 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 71 వికెట్లను తీసుకున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని మళ్లీ టెస్టులు ఆడిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 31 ఏళ్ల బుమ్రా గత ఏడాది 14.92 సగటుతో వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ తన ప్రెస్ రిలీజ్‌లో బుమ్రా బౌలింగ్ రికార్డులను విశేషేంగా మెచ్చుకున్నది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో భారత జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లోనూ అతను అత్యధికంగా వికెట్లను తీశాడు.
స్మృతి మందనాకూ ఐసిసి అవార్డు
మహిళా బ్యాటర్ స్మృతి మందానా ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. గత ఏడాది వన్డే క్రికెట్‌లో స్మృతి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 2024లో ఆమె రన్‌మెషీన్‌లా స్కోర్ చేసింది. కేవలం 13 వన్డేల్లో 747 రన్స్ చేసిందామె. భారత జట్టు విజయాల్లో బ్యాటర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఇండియా 3-0 తేడాతో గెలవడంలో స్మృతి కీలకంగా నిలిచింది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో.. తుది వన్డేల్లో సెంచరీతో చెలరేగింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి తన సత్తా చాటింది.
ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్‌జాయ్ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. పేస్ బౌలింగ్‌తో పాటు పవర్‌ఫుట్ బ్యాటింగ్‌తో అతను 2024లో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇవాళ ఈ యేటి వన్డే క్రికెటర్ పేరును ప్రకటించింది. గత ఏడాది మొత్తం అతను బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. బ్యాటింగ్‌లో 52.12 సగటుతో అతను స్కోరింగ్ చేశాడు. బౌలింగ్‌లో 20.47 యావరేజ్‌తో వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 149 రన్స్ చేయగా, దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను 50 బంతుల్లో 86 రన్స్ స్కోర్ చేశాడు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







