కబాలి సినిమా కేరళ రైట్స్ సొంతం చేసుకున్న మోహన్ లాల్
- June 30, 2016
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్ తో పాటు యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న కబాలి సినిమాపై మాలివుడ్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా కేరళ రైట్స్ ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ రైట్స్ తీసుకోవటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కబాలి యూనిట్. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. మలేషియాలో స్థిర పడిన శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ వయసు మళ్లిన డాన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి జూలై రెండో వారంలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







