ఇండిగో ఎయిర్‌లైన్స్ వారి గొప్ప ఆఫర్లు
- June 30, 2016
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే గో ఎయిర్, ఎయిర్ ఏసియా పలు స్కీంలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో కూడా ప్రమోషనల్ ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. అన్ని పన్నులతో కలిపి రూ. 1,106 ప్రారంభ ధరలతో విమాన టికెట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
జులై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశీయ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుంది. దీని ప్రకారం.. రూ. 1,106కే శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణించొచ్చు. ఇక దిల్లీ నుంచి లఖ్‌నవూకు రూ. 1,500. అహ్మదాబాద్ నుంచి ముంబయికి రూ. 1,200తో టికెట్ ధరలు ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు కేటాయించబోతోందన్నదన్న విషయాన్ని మాత్రం ఇండిగో స్పష్టం చేయలేదు.
సాధారణంగా వర్షాకాలంలో విమాన ప్రయాణికుల రద్దీ తక్కువ ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







