ఎక్స్పీరియం పార్క్ ప్రారంభం...
- January 28, 2025
హైదరాబాద్: ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ పార్కును ప్రారంభించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఈ పార్క్‌ను అద్భుతమైన కళాఖండంగా అభివర్ణించారు. విశాలమైన విస్తీర్ణంలో ప్రకృతి అందాలను అలరించుకునేలా రూపొందించిన ఈ పార్కు అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని చిరు అన్నారు.
పార్క్ సందర్శన సందర్భంగా చిరంజీవి ఆహ్లాదకరమైన అభిప్రాయాలను పంచుకున్నారు. షూటింగ్‌లకు ఈ పార్కును అందుబాటులో ఉంచుతారా అని సరదాగా అడిగారు. దీనికి రాం దేవ్ ఫస్ట్ షూటింగ్ చిరంజీవిదే అయితే అనుమతిస్తానని జవాబిచ్చారని చిరు తెలిపారు. అయితే ఎండల కాలంలో షూటింగ్ కష్టమని, చలికాలంలో ఇక్కడ చిత్రీకరణ చేయడం అనుకూలమైందని , వర్షాకాలంలో ఈ పార్కు మరింత పచ్చదనంతో కళకళలాడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ పార్కు పెళ్లిళ్లు, రిసెప్షన్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్లకు సరిగ్గా సరిపోతుందని చిరంజీవి అన్నారు. ఇటువంటి పార్కులు పర్యావరణానికి మేలు చేస్తాయని, ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. కొన్నేళ్లలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ఇంట్లో మొక్కల పెంపకంపై చిరంజీవి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. 2002 నుండి మొక్కలను పెంచుతానని, రాం దేవ్ అందించే కొత్త మొక్కల గురించి ప్రతిసారి ఆసక్తిగా వినుతుంటానని తెలిపారు. ప్రస్తుతం మొక్కల ధరలు కోటల్లో ఉంటున్నాయని, అవి కొనడం తనకు సాధ్యం కాకపోవచ్చని సరదాగా చెప్పిన చిరంజీవి, రాం దేవ్ చూపిన ప్రేరణకు కృతజ్ఞతలు తెలిపారు.
రాం దేవ్ 24 ఏళ్లుగా ఈ పార్క్‌ను రూపొందించడంలో చేసిన కృషిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. డబ్బులు, ల్యాండ్ ఉండడంతో వ్యాపారంగానే చూడకుండా ప్రకృతిపై ప్రేమతో ఈ కళాఖండాన్ని సృష్టించారని ఆయన ప్రశంసించారు. ప్రకృతి రక్షణకు అంకితమై ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం మనకు ఒక పాఠమని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







