'తండేల్' ట్రైలర్ వచ్చేసింది..
- January 28, 2025
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు.మీరు కూడా ట్రైలర్ చూసేయండి.
ట్రైలర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో మొదలయి హీరో వేటకు వెళ్ళే వాళ్ళందరికి తండేల్ గా ఎన్నికవడం, వేటకు వెళ్లాలని చూస్తే హీరోయిన్ వద్దనడం,వేటకు వెళ్ళాక అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి వాళ్లకు చిక్కడం, అక్కడ్నుంచి హీరో–మిగిలిన వాళ్ళు ఎలా బయటపడ్డారు అని ప్రేమతో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
ఈ సినిమాని శ్రీకాకుళంకు చెందిన పలువురు మత్స్యకారుల రియల్ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు.సినిమాని కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. చైతూ, సాయి పల్లవి శ్రీకాకుళం యాసలో మెప్పించబోతున్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







