ఇలాంటి హత్య కేసు ఇప్పటి వరకు చూడ లేదు: సీపీ సుధీర్ బాబు

- January 29, 2025 , by Maagulf
ఇలాంటి హత్య కేసు ఇప్పటి వరకు చూడ లేదు: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: మీర్‌పేట హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని మంగళవారం మీడియా ఎదుట రాచకొండ పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. వెంకట మాధవి హత్య కేసులో ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు.ఈ హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.అయితే ఈ హత్యకు పాల్పడిన నిందితుడు గురుమూర్తిలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు.ఇక ఈ హత్యకు సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలను సైతం సేకరించామని వివరించారు.ఈ కేసులో నిందితుడు గురుమూర్తిపై బీఎన్ఎస్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేశాడన్నారు.అయితే భార్య వెంకట మాధవిని హత్య చేయాలని అతడు ముందే ప్లాన్‌ చేశాడని తెలిపారు.

అందుకోసం పిల్లలను వాళ్ల బంధువుల ఇంట్లో ఉంచాడని తెలిపారు. అయితే వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత.. ఆమె డెడ్ బాడీని 8 గంటల పాటు ముక్కలుగా చేసి పౌడర్‌గా మార్చాడన్నారు. ఎముకలు కాల్చిన బూడిదను చెరువులో గురుమూర్తి పడేశారని వివరించారు.

ఆ తర్వాత సర్ఫ్‌, ఫినాయిల్‌లను ఉపయోగించి.. ఎక్కడ ఆధారాలు లేకుండా చేశాడని రాజకొండ సీపీ సుధీర్ బాబు వివరించారు. మరోవైపు మీర్‌పేట్ హత్య కేసులో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. అందులోభాగంగా నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి పోలీసుల విచారించారు. భార్య వెంకట మాధవిని ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. అలాగే ఆమె డెడ్ బాడీని సైతం ముక్కలుగా చేసినట్లు నేరాన్ని గురుమూర్తి అంగీకరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com