కువైట్ లో పలు భాషల్లో ట్రాఫిక్ అవగాహన ప్రచారం..!!

- January 29, 2025 , by Maagulf
కువైట్ లో పలు భాషల్లో ట్రాఫిక్ అవగాహన ప్రచారం..!!

కువైట్: కొత్త ట్రాఫిక్ చట్ట సవరణల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. కువైట్‌లోని పౌరులు,  నివాసితులందరికీ చేరేలా ఈ ప్రచారం ఆరు భాషలలో నిర్వహించనుంది.  అరబిక్‌తో పాటు, ఇంగ్లీష్, ఫార్సీ, హిందీ, బెంగాలీ, ఉర్దూ, తగలోగ్‌లలో ప్రచారం అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ చట్టం అప్డేట్ నిబంధనలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొంది.  ఈ చొరవ ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి, సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ విస్తృత ప్రయత్నాలలో భాగమని తెలిపింది. దీనిని సాధించడానికి సాంప్రదాయ పద్ధతులతోపాటు  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుంటామని వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com