గల్ఫ్ ఎయిర్ అకాడమీలోBD40,000 ఫ్రాడ్..అకౌంటెంట్‌కు ఐదేళ్ల జైలుశిక్ష..!!

- January 29, 2025 , by Maagulf
గల్ఫ్ ఎయిర్ అకాడమీలోBD40,000 ఫ్రాడ్..అకౌంటెంట్‌కు ఐదేళ్ల జైలుశిక్ష..!!

మనామా: హై క్రిమినల్ కోర్ట్ 36 ఏళ్ల అకౌంటెంట్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, 41,770.795 బిడి జరిమానా విధించింది. అతడిని దోషిగా నిర్ధారించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్ అకాడమీకి అదే మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కేసు రికార్డుల ప్రకారం.. అకాడమీలో సీనియర్ అకౌంటెంట్ , యాక్టింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్‌గా పనిచేసిన అకౌంటెంట్ జనవరి 2021 - ఏప్రిల్ 2022 మధ్య BD 54,121 అపహరణకు పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ట్రైనీల నుండి స్వీకరించిన నగదు చెల్లింపులను దుర్వినియోగం చేయడం, నిధులను అకాడమీకి జమ చేయకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించినట్టు, అకౌంటెంట్ అకాడమీ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావాదేవీ డేటాతోపాటు తేదీలను మార్చాడని, బ్యాంకు రిసిప్టులను తప్పుగా మార్చాడని, తప్పుడు డేటాతో నివేదికలను సిద్ధం చేశాడని ఆరోపించారు. అకాడమీ బ్యాంక్ రికార్డులు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మధ్య వ్యత్యాసాలను కవర్ చేయడానికి అతను తప్పుడు విలువ ఆధారిత పన్ను (VAT) నమోదులను నమోదు చేసినట్లు కూడా గుర్తించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com