ఐసీసీ సీఈవో జెఫ్ అలార్జీస్ రాజీనామా

- January 29, 2025 , by Maagulf
ఐసీసీ సీఈవో జెఫ్ అలార్జీస్ రాజీనామా

న్యూ ఢిల్లీ: ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆరంభం కానుంది.మ‌రికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుండ‌గా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్జీస్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.అత‌డు రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాలు అయితే ఇంత వ‌ర‌కు వెల్ల‌డి కాలేదు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ విష‌యంలో పాకిస్థాన్ స‌న్న‌ద్ధ‌త‌ను స్ప‌ష్టంగా వివ‌రించ‌లేక‌పోవ‌డం ఆయ‌న రాజీనామాకు ఓ కార‌ణంగా ఓ ఐసీసీ స‌భ్యుడు పేర్కొన్న‌ట్లు ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.అమెరికా వేదిక‌గా నిర్వ‌హించిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ప్లాఫ్ కావ‌డం, అక్క‌డ అనుకున్న బ‌డ్జెట్ కంటే అధికంగా కావ‌డం ఇలా చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా భార‌త జ‌ట్టు పాక్‌లో ప‌ర్య‌టించ‌బోమ‌ని చెప్ప‌డంతో హైబ్రిడ్ మోడ్‌లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. భార‌త్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.క‌రాచీ, లాహోర్‌, రావ‌ల్సిండి వేదిక‌గా పాక్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే..ఈ స్టేడియాల‌ను ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం ఆధునీక‌రించే ప‌నులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.అయితే..టోర్నీ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కూడా ప‌నులు పూర్తి కాలేద‌ని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com