వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!
- January 29, 2025
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వాహన డ్రైవర్లపై ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం తెలిపింది. ఇందుకు దేశవ్యాప్తంగా కొత్త తరం ఏఐతో పనిచేసే ట్రాఫిక్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అధునాతన కెమెరాలు, అధిక-నాణ్యతతో రికార్డు చేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ ఫ్లో తోపాటు డ్రైవర్ ప్రవర్తన సహా రహదారిపై అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు భద్రతా బలగాలకు సహాయపడతాయని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, ఈ కెమెరాలు 40వేల సీట్ బెల్ట్, హ్యాండ్-హెల్డ్ ఫోన్ ఉల్లంఘనలను రికార్డ్ చేశాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







