సౌత్ సూడాన్ లో కుప్పకూలిన విమానం...20 మంది దుర్మరణం

- January 29, 2025 , by Maagulf
సౌత్ సూడాన్ లో కుప్పకూలిన విమానం...20 మంది దుర్మరణం

సౌత్‌ సూడాన్‌లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు.

యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్‌ పయనీర్‌ ఆపరేటింగ్‌ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది.

ప్రమాదం పై సౌత్‌ సూడాన్‌ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్‌వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. విమానం ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

స్థానిక అధికారుల వివరాల మేరకు.. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్‌ సూడాన్‌, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ప్రమాదంతో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిధిలాలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com