ఎస్తేర్ హత్యాచారం కేసు: ఉరిశిక్ష పడిన దోషికి సుప్రీం విముక్తి …
- January 29, 2025
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్యాచార కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అంతకు మందు బొంబాయి కోర్టు, హైకోర్టు విధించిన ఉరిశిక్షను తోసిపుచ్చింది.
వివరాల్లోకి వెళితే…విజయవాడకు చెందిన ఎస్తేర్ అనూహ్య.. ముంబైలో టాటా కన్సుల్టేన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది.అయితే క్రిస్మస్ సెలవుల కోసం 2023, డిసెంబర్‌లో స్వస్థలం విజయవాడకు వచ్చింది.తిరిగి రెండు వారాలు తర్వాత.. విజయవాడ నుంచి లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ముంబైకి బయల్దేరి వెళ్లింది. ఎంతో సంతోషంగా తల్లిదండ్రులు.. కుమార్తెను సాగనంపారు. జనవరి 5, 2014న లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషన్‌లో దిగింది. సీసీకెమెరాలో కూడా రికార్డ్ అయింది. అనంతరం అక్కడే ఉన్న చంద్రభాన్ సనప్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పరిచయం చేసుకుని లగేజీ తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. తీరా.. క్యాబ్ దగ్గరకు తీసికెళ్లాక బైక్ ఎక్కించుకునే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. మొత్తానికి ఆమెను ఒప్పించి బైక్ ఎక్కించుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఎస్తేర్ ఫోన్ పనిచేయకుండా పోయింది. దీంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు.. ముంబైకి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చేపట్టారు.చివరికి 10 రోజుల తర్వాత 2014, జనవరి 16న ముంబైలోని కంజుర్‌మార్గ్‌లో కుళ్లినస్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు.. పేరెంట్స్‌ను తీసుకొని వచ్చి చూపించగా మృతదేహం ఎస్తేర్ అనూహ్యదేనని తేలడంతో నిశ్చేష్టులయ్యారు. ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు.
ఉరి శిక్ష వేసిన ముంబై కోర్టు, హైకోర్టు
ఇక అక్టోబర్ 2015లో ఎస్తేర్ హత్యాచార కేసులో చంద్రఖాన్ సనప్‌ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. శిక్షను ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి వృశాలి జోషి మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన కేసు అని, మరణశిక్షకు అర్హత సాధించిందన్నారు.‘‘ఈ కేసు అరుదైన అరుదైన కేటగిరీ కిందకు వస్తుంది, కాబట్టి నిందితుడికి మరణశిక్ష విధించబడింది. అతను చనిపోయే వరకు అతని మెడకు ఉరి వేయాలి’’ అని న్యాయమూర్తి తీర్పు వెలవరించారు.ఆ తర్వాత బొంబాయి హైకోర్టు కూడా మరణశిక్షను సమర్థించింది. అలాంటి వ్యక్తి సమాజానికి పెనుముప్పుగా మిగిలిపోతాడని, ఈ నేరానికి మరణశిక్ష తప్పదని హైకోర్టు పేర్కొంది.ఆధారాలు లేవంటూ సుప్రీం కోర్టు తీర్పు….
అయితే ముంబై కోర్టు తీర్పుపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.దీంతో చంద్రఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దోషిగా నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ సాక్ష్యం సరిపోదని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.సరైన ఆధారాలు లేవని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.సుప్రీంకోర్టు తీర్పుపై ఎస్తేర్ తండ్రి జోనాథన్ ప్రసాద్ నిరాశ చెందారు.సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి విన్నానని.. ఇక దాని గురించి ఏమీ చేయలేమని తెలిపారు.ఏం జరుగుతుందో తమకు తెలియదని పేర్కొన్నారు.నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలియదని చెప్పారు.ఈ కేసును దేవుడికి వదిలేస్తున్నట్లు చెప్పారు. 70 ఏళ్ల వయసులో న్యాయస్థానంతో పోరాడలేనని చెప్పారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







