ఫిబ్రవరిలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?
- January 30, 2025
యూఏఈ: జనవరిలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు $81 వరకు పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా యూఏఈలో పెట్రోల్ ధరలు ఫిబ్రవరి నెలలో పెరుగుతాయని భావిస్తున్నారు. రష్యా ముడిచమురు ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల విధానంపై అనిశ్చితి కారణంగా జనవరిలో చమురు ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా పెట్రోలు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2024లో బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ ధర $73తో పోలిస్తే జనవరిలో బ్యారెల్ సగటు $77.55గా ఉంది. యూఏఈ జనవరిలో సూపర్ 98, స్పెషల్ 95, ఇ-ప్లస్ ధరలు వరుసగా లీటరుకు Dh2.61, Dh2.5, Dh2.43. డీజిల్ ధర లీటరు Dh2.68గా ఉంది. సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా మాట్లాడుతూ.. బ్రెంట్ బ్యారెల్‌కు $81 కంటే ఎక్కువ పెరిగి నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం గరిష్ఠ స్థాయికి చేరుకుందన్నారు. అమెరికా ఆంక్షలు ఎక్కువమొత్తంలో కొనుగోలు చేసే చైనా, ఇండియాలపై రష్యా క్రూడ్ ఎగుమతులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. అమెరికా కొత్త ఆంక్షల వల్ల రష్యా చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయని, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాల నుండి మరింత ముడి చమురును సేకరించేందుకు ధరలు, షిప్పింగ్ ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







