విశాఖ: ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు
- January 30, 2025
విశాఖపట్నం: లక్జరీ లైఫ్‌ను అలవాటు చేసి అమ్మాయిలను, గృహిణులను తమ స్వాధీనంలో ఉంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కోసం అమాయక మరియు ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహించిన ముఠాను రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
అక్కడితో ఆగకుండా ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నారో విచారణ వేగవంతం చేశారు. ఇంత పెద్ద సెక్స్ నెట్ వర్క్ నడుపుతున్న ప్రధాన రావాడ కామరాజు (28) టెక్నాలజీని వాడుతూ ఎప్పటికప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తూ నడిపించాడని పోలీసులు వెల్లడించారు. అమ్మాయి కావాలంటూ తమను సంప్రదించి విటులకు అమ్మాయిల వివరాలు, కలుసుకునే చోటు, ఎప్పుడు ఎక్కడ మీట్ అవుతారు ఇలా ప్రతీది ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతుంది. అలాగే వారికి డబ్బులు వచ్చేస్తాయి. ప్రధాన నిందితుడు కామరాజును పోలీసులు విచారణలో బుధవారం మరో నలుగురుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించిన రెండవ పట్టణ పోలీసులు ఈ రాకెట్ మూలాలను కూడా ఛేదించి ప్రయత్నంలో తలమునకలయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి ఈ రాకెట్ పూర్వపరాలు వెలికి తీస్తున్నట్టు సమాచారం .ముఠా ఆర్గనైజర్లు వాడిన వెబ్సైట్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన 11 మంది నిందితులతో పాటు బుధవారం మరో 4 గురుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. వీరు వాడిన మొబైల్ ఫోన్‌డేటా ఆధారంగా విటుల వివరాలను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష