జ్లీబ్ అల్-షుయౌఖ్‌కు పరిష్కారం.. జిలీబ్‌లో కౌన్సిల్ పర్యటన..!!

- January 30, 2025 , by Maagulf
జ్లీబ్ అల్-షుయౌఖ్‌కు పరిష్కారం.. జిలీబ్‌లో కౌన్సిల్ పర్యటన..!!

కువైట్: గత నవంబర్‌లో ‘జ్లీబ్ అల్-షుయౌఖ్ పర్యావరణ వ్యవస్థ – కమ్యూనిటీ పార్టిసిపేషన్’ పేరుతో జరిగిన వర్క్‌షాప్‌కు కొనసాగింపుగా, పర్యావరణ వ్యవహారాల కమిటీ వచ్చే నెలలో జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో పర్యటించనుంది. ఈ క్రమంలో వర్క్‌షాప్ ఎనిమిది సిఫార్సులను ప్రతిపాదించగా, వీటిని మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది. గత నెలాఖరులో రాష్ట్ర పురపాలక వ్యవహారాల మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్-మిషారీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.  ఈ సిఫార్సులు ప్రధానంగా జ్లీబ్ అల్-షుయౌఖ్‌లోని  పర్యావరణ విపత్తు పరిస్థితిని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో మునిసిపాలిటీ, ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీచే నిబంధనల అమలును అంచనా వేయడానికి క్షేత్ర పర్యటనకు పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com