ఈ చిట్కాలు పాటిస్తే షుగర్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు....!

- January 30, 2025 , by Maagulf
ఈ చిట్కాలు పాటిస్తే షుగర్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు....!

హెల్దీ లైఫ్‌స్టైల్ అని చెప్పగానే చాలా మంది మొదటగా చేసే పని స్వీట్స్, షుగర్ ఫుడ్స్‌కి దూరంగా ఉండడం, షుగర్‌ని తగ్గించడం. అయితే, దీనిని కొన్ని రోజులు పాటిస్తాం. తర్వాత అలాంటి ఫుడ్స్‌, డ్రింక్స్‌కే అలవాటైన మనం తిరిగి వాటిని తీసుకుంటుంటాం. కారణం కొన్ని ఫుడ్స్, డ్రింక్స్‌లో మనకి తెలియకుండానే పంచదార ఉంటుంది. ఫ్రక్టోజ్, మాల్టోస్ వంటి అనేక రూపాల్లో పంచదార ఉంటుంది.  

కానీ, వీటికి దూరంగా మనం హెల్దీగా ఉండాలంటే మనం అలాంటివాటన్నింటికీ దూరం చేసుకోవాల్సిందే. అప్పుడే మనం ఓవరాల్ హెల్దీగా ఉంటాం. అయితే, పంచదారని అవాయిడ్ చేస్తేనే సరిపోదు. కొన్ని పదార్థాల్లో కూడా పంచదార ఉంటుంది కాబట్టి, వాటిని దూరం చేయాల్సిందే. ముందుగా అలాంటివేంటో తెలుసుకుని వాటిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకోండి. 

మనం ఇంట్లో ఏవైనా సమోసా, కచోరీ, బజ్జీల వంటివి చేసినప్పుడు హెల్దీగా సలాడ్ కూడా ట్రై చేసినప్పుడు అందులో మనం సాస్ వేసుకుని తింటాం. ఇందులో కూడా మనకి తెలియకుండానే బోలెడు పంచదార ఉంటుంది. 

బేకింగ్ ఫుడ్స్ : 

మనం హెల్దీ అని తీసుకునే హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లో కూడా ఎంతో కొంత పంచదార ఉండనే ఉంటుంది. మఫిన్స్‌లో కూడా.

సెరల్స్ :

ఉదయాన్నే ఈజీగా తయారయ్యే సెరల్స్‌లో కూడా యాడెడ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది.

డెయిరీ ప్రోడక్ట్స్ : 

ఫ్లేవర్డ్ యోగర్ట్, మిల్క్‌లో మనకి తెలియకుండానే ఎక్కువగా పంచదార ఉంటుంది.

స్నాక్స్ :

గ్రనోలా, బార్స్, ప్రోటీన్ బార్స్, నట్ బటర్స్‌లో కూడా ఎక్కువగా పంచదార ఉంటుంది.

ఫ్రూట్స్, జ్యూసెస్ :

ఇక పండ్ల రసాల్లోనూ ఎక్కువగా పంచదార ఉంటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్ :

ప్యాకేజ్డ్, స్వీట్ ఫుడ్స్‌లో కూడా ఎక్కువగా పంచదార ఉంటుంది. దీనిని తినడం వల్ల పంచదార మన బాడీలోకి చేరుతుంది. 


పంచదార ఎక్కువగా ఉన్నవాటికంటే నేచురల్ స్వీటెనర్స్ అయిన స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి ఫుడ్స్‌లో తక్కువగా షుగర్ ఉంటుంది. దీనిని తీసుకోవడం కూడా చాలా మంచిది ఆప్షన్. వీటిని మన డైట్‌లో యాడ్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి, హ్యాపీగా వీటిని తీసుకోవచ్చు. 

ఇక చాలా మంది పంచదార తినట్లేదని ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారు. కానీ, ఇందులోనూ ఎక్కువగా పంచదార ఉంటుంది. అలా కాకుండా నేచురల్ షుగర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. జంక్ తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్ వంటి ఫుడ్స్‌ని ప్రాసెస్డ్ ఫుడ్స్ బదులు తీసుకోవచ్చు. 

షుగర్, షుగర్ ఫుడ్స్ మానేసినప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీంతో పాటు కొన్ని సమస్యలొస్తుంటాయి. మన బాడీలో ఎనర్జీ తగ్గుతుంటుంది. హార్మోన్స్ తేడాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆడవారిలో. దీంతో అది మెనుస్ట్రువల్ సైకిల్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇది లాంగ్‌టర్మ్‌లో హార్మోన్ రెగ్యులేషన్‌పై ఎఫెక్ట్స్ చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. బ్లోటింగ్, బౌల్ మూమెంట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటన్నింటిని అర్థం చేసుకోవాలి. మెల్లిమెల్లిగా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. షుగర్ ఫుడ్స్‌ని మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయాలి. కంగారు పడొద్దు. 

మనం షుగర్ మానేసేటప్పుటు వాటి ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు. ముందుగా మీల్స్ ప్లాన్ చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ చేయండి. దీంతో ఆకలి వేసినప్పుడు అన్‌హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటారు. హైడ్రేట్‌గా ఉండాలి. దీంతో షుగర్ క్రేవింగ్స్ రావు. మొదట్లో కాస్తా కష్టంగా అనిపించినప్పటికీ, రాన్రాను ఈ మార్పుల వల్ల మీరే హెల్దీగా మారతారు. బరువు తగ్గడం దగ్గర్నుంచీ ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి, ఈ ప్రయత్నాలు చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com