కళ్యాణ్ రామ్ అనీల్ దర్శకత్వంలో...
- June 30, 2016
దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది.అదే జోష్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మరోసారి పటాస్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడా అనీల్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









