FTPC ఇండియా కు అమెరికా క్వాలిటీ కౌన్సిల్ సర్టిఫికేషన్

- January 31, 2025 , by Maagulf
FTPC ఇండియా కు అమెరికా క్వాలిటీ కౌన్సిల్ సర్టిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్ర మరియు టెలివిజన్ రంగ అభ్యున్నతి దిశగా పలు కార్యక్రమాలను చేపడుతున్న ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను గుర్తిస్తూ అమెరికన్ క్వాలిటీ కౌన్సిల్ ఏ.ఖ్యూ.సి.యూ.ఎస్ 0021(ASQ US 0021) క్వాలిటీ సర్టిఫికెట్ ని ప్రదానం చేసింది.సినీ సాంకేతిక, మానవ వనరుల మరియు ప్రచార కార్యక్రమాల ద్వారా సంస్థ సినీ టెలివిజన్ రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అమెరికన్ క్వాలిటీ కౌన్సిల్ చైర్మన్ జితేంద్ర మిత్లాని పేర్కొన్నారు.హైదరాబాద్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన వేడుకలో సర్టిఫికెట్ ప్రదానం చేసిన మిత్లాని మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా ఓ భాషలో నటించే నటులు మరో భాషలోకి , ఓ చోట వున్న పరిజ్ఞానం మరో చోట బదిలీ చేసుకొనే అవకాశాన్ని కల్పించడమే కాక ఆయా బాషల చిత్రాలకు నటులకు దేశీయ అంతర్జాతీయ స్థాయిల్లో ప్రాచుర్యాన్ని కల్పించడంలో ఎఫ్ టీ పీ సి ఇండియా ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు.ఎన్.టీ.ఆర్ అవార్డ్స్ తో వరల్డ్ రికార్డు సాధించిన తమకు ఇప్పుడు అమెరికన్ క్వాలిటీ కౌన్సిల్ సర్టిఫికెట్ లభించడం తమపై మరింత బాధ్యతను పెంచిందని అధ్యక్షులు చైతన్య జంగా పేర్కొన్నారు.FTPC ఇండియా ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫిలిం ఎక్స్చేంజ్ నిర్వహించిన మా సంస్థ నేపాల్, శ్రీలంక,మలేషియా, సింగపూర్,థాయిలాండ్ లలో కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి మన దేశ బాషల చిత్రాలకు ముఖ్యంగా ప్రాంతీయ భాషా చిత్రాలకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com