ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం
- February 01, 2025
పూణే: ఇంగ్లండ్ తో జరిగిన నాల్గోవ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 15 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బ్రూక్ 26 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 39 పరుగులు, ఫిల్ సాల్ట్ 23 రన్స్ చేశారు.
ఒక దశలో ఇంగ్లండ్ కే గెలుపు అవకాశాలు కనిపించాయి. అయితే, 15వ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. 2 వికెట్లు తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఇక దూబెకు కంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి టీమిండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. అటు రవి బిష్ణోయ్ కూడా 3 వికెట్లతో రాణించాడు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. రింకూ సింగ్ (30; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (29; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు.
సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (5)లు విపలం అయ్యారు.ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు, జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. 4వ టీ20లో గెలిచిన భారత్.. 3-1 తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







