ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు
- February 01, 2025
అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఆయన పదవీకాలం నేటితో ముగిసింది.ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పని చేస్తానని అన్నారు.
కాగా, ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా బాధ్యతలు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. డీజీపీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అనివార్యం కాగా.. హరీష్‌కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా.. ప్రస్తుతం ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







