క్యాన్సర్‌తో సహా 36 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత..
- February 01, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో పలు రంగాల వారికి శుభవార్తలు చెప్పారు.అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఆమె కీలక ప్రకటన చేశారు.క్యాన్సర్ రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో క్యాన్సర్ కు సంబంధించిన మందులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందేందుకు వినియోగించే 36 రకాల మందులను పన్నుల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు.ఈ క్రమంలో క్యాన్సర్ సహా ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించి 36రకాల మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించినట్లు వెల్లడించారు.దీనివల్ల వైద్య చికిత్సలో వినియోగించే మెడిసిన్లు, ఇతర డ్రగ్స్ కొనుగోలు భారం కొంతమేర అయిన తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా మరో 37 మందులు, 13 కొత్త పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లు (రోగులకు ఉచితంగా మందులు సరఫరా చేసేవి) ఉంటాయి. కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.
అదేవిధంగా జిల్లాకు ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంజరుగుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.దీంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం తప్పనుంది.వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 క్యాన్సర్ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







