ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది..
- February 01, 2025
రెగ్యులర్ గా కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లు తీసుకొచ్చే ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ వచ్చేస్తుంది.ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది.ఈ షో కు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో మెంటార్స్ గా మానస్, యశ్ మాస్టర్, నటి దీపికా, డ్యాన్సర్ జాను లైరి, మోడల్ ప్రకృతిలు ఉండబోతున్నారు.
నేడు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. అలాగే ఆహా ఓటీటీ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో హోస్ట్ తో పాటు జడ్జీలు, మెంటార్స్, పార్టిసిపెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసారు. మీరు కూడా ప్రోమో చూసేయండి.
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 లాంచ్ ఈవెంట్లో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ..డ్యాన్స్ ఐకాన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 తీసుకొస్తున్నాం.డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు.పంచభూతాల్లాంటి వారి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు అని తెలిపారు.
శేఖర్ మాస్టర్ షూటింగ్స్ ఉండి రాకపోవడంతో వీడియో పంపించారు.ఈ వీడియోలో మాట్లాడుతూ.. మూవీస్ బిజీలో ఉండటం వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోయాను.నేను జడ్జ్ గా చేస్తున్నాను.మేము కూడా సర్ ప్రైజ్ చేసేలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఉంటాయి.ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది అని చెప్పారు.అలాగే ఈ ప్రెస్ మీట్ లో మెంటార్స్ మానస్, జాను లైరి, ప్రకృతి, యశ్ మాస్టర్ లు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష