ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
- February 03, 2025
ముంబై: కస్టమ్స్ అధికారులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు.ఈ డ్రగ్స్‌ను స్మగ్లర్ పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టినట్లు గుర్తించారు.ముంబై విమానాశ్రయంలో గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఈ కేటుగాడిని, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు.అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు.
ఈ ఘటన ముంబైలో డ్రగ్స్ మాఫియా మళ్లీ చురుకుగా ఉందని సూచిస్తోంది. స్మగ్లింగ్‌లో ఎక్కువగా విదేశీయులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇంకొక ప్రధాన కేసులో, కస్టమ్స్ బృందం విమానాశ్రయంలో 55 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, ఫారిన్ గంజాయిని పట్టుకుంది. జనవరి నెలలోనే కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్‌పై గట్టి నిఘా పెట్టి, ఈ భారీ స్వాధీనం చేసుకున్నారు.సింగపూర్, ఇథియోపియా, బ్యాంకాక్, దుబాయ్, కెన్యా నుండి ఢిల్లీకి వచ్చిన 8 మంది స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
వారు డ్రగ్స్, బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి వినూత్నమైన మార్గాలను అనుసరించారు. బట్టలకు బదులుగా విదేశీ గంజాయిని ప్యాకింగ్ చేసిన స్మగ్లర్, బంగారాన్ని ముద్దగా చేసి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి, బెల్ట్‌లా తయారు చేసుకొని నడుముకు కట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ తరహా స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో,విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం మరింత నిఘా పెంచింది.డ్రగ్స్, బంగారం, వజ్రాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనలు ముంబై విమానాశ్రయం సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







