దుబాయ్‌లో గల్ఫ్ కార్మికులను కలిసిన కాంగ్రెస్ నాయకులు...
- February 04, 2025
దుబాయ్: దుబాయ్‌లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికుల బాగోగులు ఎలా ఉన్నాయి? వాళ్ల కష్ట సుఖాలు గురించి తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాల్కొండ మాజీ శాసన సభ్యులు,తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావత్రి కోరగా దుబాయ్ గల్ఫ్ ప్రవాస భారతీయుల సంఘం అధ్యక్షులు S.V రెడ్డి జేబెల్ అలీ ప్రాంతంలోని కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అయన కార్మికుల జీవన విధానం అడిగి తెలుసుకున్నారు.
గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చన ప్రకారం గల్ఫ్ కార్మికులకు ఎవరైనా గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో అమలు చేసిందని కార్మికులతో ఆయన అన్నారు.ఈ జీవో అమలు చెయ్యడం భారత దేశంలోనే మొదటి సారి తెలంగాణ ఘనత సాధించిందని పేర్కొన్నారు.అంతేకాకుండా గల్ఫ్ సంక్షేమ శాఖ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో S.V రెడ్డి మాట్లాడుతూ...BJP,BRS పార్టీలు ఇంతవరకు గల్ఫ్ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు మరియు BRS పార్టీ రెండు సార్లు గెలిచినప్పటికి ఆ పార్టీ నేతలు ఒక్కసారి కూడా గల్ఫ్‌లో ఉన్న ఏ దేశం వెళ్లి కార్మికులను కలువలేదు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏమీ పట్టించుకోలేదు.అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉన్న కూడా పలు సార్లు గల్ఫ్ వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని S.V రెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్లకు అండగా నిలిచే పార్టీ అని,ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని ఆయన అన్నారు.ఆ తరువాత దుబాయ్ లో ఉన్న రాయబార కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో చర్చించి కార్మికులకు ఎలాంటి సేవలు అందుతున్నాయో అనిల్ కుమార్ ఈరవత్రి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ నాయకులు భీమ్‌రెడ్డి ,దేవేందర్ రెడ్డి ,కే.వేణు,రవి డేవిడ్,పెద్ది రవి కుమార్,కిరణ్ ,సత్యం సుతారీ,వంశీ బాల్కొండ,చంద్ర శేఖర్ ఆజాద్, తిరుపతి రెడ్డి.కట్కం రవి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







