కట్టుదిట్టమైన భద్రతల తో అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- July 01, 2016
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్రను జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 1,292 మంది యాత్రికులు అమర్నాథ్ బయలుదేరారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పలు ప్రాంతాల నుంచి యాత్రికులను సీఆర్పీఎఫ్ కాన్వాయ్ల్లో భగవత్ నగర్ స్థావరానికి తీసుకొచ్చారు. ఉదయం 5:00 గంటలకు యాత్ర ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.
అమర్నాథ్కి వెళ్లే దక్షిణ కశ్మీరులోని పహల్గామ్, ఈశాన్య సోనా మార్గాల్లో 12,500 మంది పారామిలిటరీ సిబ్బంది, 8,000 మంది రాష్ట్ర పోలీసులను ఏర్పాటుచేశారు. యాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. అమర్నాథ్ మంచు లింగం తొలి దర్శనంలో ఆయన పాల్గొంటారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







