స్టాప్‌ఓవర్ ప్రోగ్రామ్.. జనవరిలో రికార్డుస్థాయిలో విజిటర్స్..!!
- February 06, 2025
దోహా, ఖతార్: ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ విభాగం డిస్కవర్ ఖతార్.. ఆగస్టు 2021లో ఖతార్ స్టాప్‌ఓవర్ ప్రోగ్రామ్ పునఃప్రారంభించింది. ఆ తర్వాత మొదటిసారిగా ఒకే నెలలో 10,000 మంది స్టాప్‌ఓవర్ సందర్శకులతో కీలక మైలురాయిని సాధించింది. జనవరి 2025లో ప్రోగ్రామ్ కింద 10,500 కంటే ఎక్కువ మంది సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జనవరి 2024లో 6,651 మంది సందర్శకులు రాగా, 2024 మార్చి-జనవరి (2025) నాటికి 165% వృద్ధిని నమోదు చేసింది.అదే సమయంలో ఈ కార్యక్రమం హోటల్ బుకింగ్‌లలో అసాధారణమైన వృద్ధి నమోదైంది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 100,000 రూమ్ లు బుక్ అయ్యాయి.ఇది గత సంవత్సరం కంటే రెట్టింపు అని డిస్కవర్ కతార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్టీవెన్ రేనాల్డ్స్ తెలిపారు. ఖతార్ ఎయిర్‌వేస్ విస్తృతమైన నెట్‌వర్క్‌ను 170 గమ్యస్థానాలకు పెంచామని.. డిస్కవర్ ఖతార్‌లో, సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రపంచ స్థాయి ఆతిథ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు మరపురాని అనుభవాలను అనుకూలమైన ప్యాకేజీలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







