చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దు.. కేంద్రం సంచలన ప్రకటన
- February 06, 2025
న్యూ ఢిల్లీ: ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్బాట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కాకుండా నేరుగా చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్బాట్ల నుంచే తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్న వారు భారీగా పెరిగిపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులను అధికారిక పనుల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటే ఏఐ టూల్స్‌ను వాడొద్దని చెప్పింది. ప్రభుత్వ పత్రాలు, డేటా గోప్యతకు సంబంధించిన రిస్కులు ఉండడంతో ఈ సూచన చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా ఇటువంటి నిబంధనలే అమలు చేస్తున్నాయి. ఏఐ వల్ల డేటా భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని భావిస్తున్నాయి. ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మన్ ఇవాళ భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవంతో బుధవారం సమావేశమయ్యారు. ఏఐకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటువంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులకు ఏఐపై చేసిన అడ్వైజరీ సామాజిక మాధ్యమాల్లోనూ కనపడింది. “ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర డివైజ్‌లలో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి ఏఐ టూల్స్, ఏఐ యాప్‌లు ఉంటే అవి డేటా, పత్రాల గోప్యత విషయంలో నష్టాలకు కలిగించే అవకాశం ఉంది” అని ఆ అడ్వైజరీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, అలాగే డీప్‌సీక్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నిజమైందేనని, ఈ నోట్‌ను అంతర్గతంగా జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ముగ్గురు అధికారులు తెలిపారు. అయితే మిగతా మంత్రిత్వశాఖలకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీచేశారో, లేదో తెలియాల్సి ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు.. ఇటలీ , ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా డీప్‌సీక్‌పై ఇలాంటి ఆంక్షలే విధించాయి. ఈ దేశాలు కూడా తమ ప్రభుత్వ డేటాకు ఇలాంటి ఏఐ టూల్స్ వల్ల ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలాఉండగా.. చాట్జీపీ, డీపసీక్.. ఇవి రెండూ కూడా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మన ఇండియా నుంచి కూడా సొంత ఏఐ మోడల్ ను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







