ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు..
- February 07, 2025
అమరావతి: ఏపీలో డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరును ఆయన వెల్లడించారు. ర్యాంకుల విషయానికి వస్తే.. చంద్రబాబు 6వ స్థానంలో ఉన్నారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండటం గమనార్హం.ఫైల్స్ ను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
దస్త్రాల క్లియరెన్స్ లో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్..
దస్త్రాల క్లియరెన్స్ లో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ నిలిచారు.రెండో స్థానంలో కందుల దుర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, 5వ స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా, 7వ స్థానంలో సత్యకుమార్, 8వ స్థానంలో నారా లోకేశ్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు.
చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్..
ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో 11వ స్థానంలో సవిత ఉన్నారు. 12వ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణరెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు ఉన్నారు.
18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో సంధ్యారాణి ఉన్నారు. 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







