35 మిలియన్లు దాటిన సౌదీ జనాభా..సౌదీయేతరులు 44.4%..!!
- February 07, 2025
రియాద్: సౌదీ అరేబియా జనాభా 2024 సంవత్సరం మధ్య వరకు 35.3 మిలియన్లకు చేరుకుంది. మొత్తం జనాభాలో సౌదీ పౌరులు 55.6 శాతం ఉండగా, సౌదీయేతరులు 44.4 శాతంగా ఉన్నారు. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తాజా నివేదికలో వెల్లడించింది. వార్షికంగా 1.6 మిలియన్ల పెరుగుదల ఉందని, 2023 మధ్యకాలంతో పోలిస్తే 2024 మధ్యకాలం వరకు 4.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.
2024 మధ్య నాటికి సౌదీల మొత్తం జనాభా 19.6 మిలియన్లకు మించిందని, 2023 మధ్యలో 19.3 మిలియన్లతో పోలిస్తే వార్షిక వృద్ధి రేటు రెండు శాతంగా ఉందని, అయితే సౌదీయేతరుల జనాభా గత ఏడాది మధ్య నాటికి దాదాపు 15.7 మిలియన్లకు చేరిందని తెలిపింది. ఒక సంవత్సరం అంచనా వ్యవధిలో మొత్తం జనాభా పెరుగుదలలో సౌదీయేతరులు 75.6 శాతంగా ఉన్నారని GASTAT తెలిపింది. ఈ వార్షిక పెరుగుదలలో సౌదీ జనాభా 24.4 శాతంగా ఉంది. 2023 మధ్య నుండి గత సంవత్సరం మధ్య వరకు పురుషుల జనాభా వార్షిక పెరుగుదల 70.8 శాతంగా ఉంది.
జాతీయత మరియు వయస్సు ఆధారంగా, పుట్టినప్పటి నుండి 14 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న సౌదీ జనాభా మొత్తం జనాభాలో 33.5 శాతంగా ఉంది. ఇది సౌదీయేతరులకు 8.6 శాతంగా ఉంది. సౌదీ జనాభాలో 62.7 శాతంతో పోలిస్తే 15 మరియు 64 సంవత్సరాల మధ్య పని చేసే సౌదీయేతరుల శాతం ఎక్కువగా ఉంది. ఇది 89.9 శాతానికి చేరుకుంది.
మొత్తం జనాభాలో సంతానోత్పత్తి రేటు ప్రతి 1000 మంది స్త్రీలకు 2 జననాలకు చేరుకుంది. సౌదీ జనాభాలో 2.7 జననాలు ఉండగా, సౌదీయేతర జనాభాలో 0.8 జననాలు ఉన్నాయి. సౌదీ జనాభా సగటు ఆయుర్దాయం 78 ఏళ్లుగా ఉందని GASTAT వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







