కార్-ఫ్రీ, గ్రీన్ జోన్లుగా దుబాయ్ నివాస ప్రాంతాలు..ప్రణాళిక ఆవిష్కరణ..!!
- February 07, 2025
యూఏఈ: దుబాయ్ తన సూపర్ బ్లాక్ చొరవతో స్థిరమైన, నివాసయోగ్యమైన నివాస ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కదులుతోంది. ఇది కార్-ఫ్రీ జోన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. గ్రీన్ భవిష్యత్తు కోసం ఈ చొరవ పాదచారులకు, సైక్లిస్టులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరిసరాలను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అల్ ఫాహిదీ, అబు హేల్, అల్ కరామా, అల్ క్వోజ్ క్రియేటివ్ జోన్ వంటి నివాస ప్రాంతాలు గ్రీన్ ప్రదేశాలను పెంచడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, సామాజిక పరస్పర చర్యలను పెంపొందించడానికి, పాదచారుల అనుకూల జోన్లుగా మార్చనున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూపర్ బ్లాక్ చొరవను ‘ఎక్స్’లో ప్రకటించారు.
దుబాయ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్ట్రాటజీలో భాగంగా ప్రపంచంలోని ఎత్తైన రిసార్ట్ కోసం ఒక ప్రణాళికను ఆవిష్కరించారు. దుబాయ్ లో జాబీల్ పార్క్ వద్ద 'థర్మీ దుబాయ్' అభివృద్ధికి DH2 బిలియన్లను కేటాయించారు. దీని నిర్మాణం 2028లో పూర్తవుతుందని భావిస్తున్నారు. అలాగే నగరంలోని 160 ప్రాంతాలలో విస్తరించి ఉన్న 6,500 కిలోమీటర్ల ఆధునిక వాకింగ్ ట్రాక్ ల నెట్వర్క్ కోసం బ్లూప్రింట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన దుబాయ్ వాక్ మాస్టర్ ప్లాన్‌లో 2040 నాటికి 3,300 కిలోమీటర్ల కొత్త వాకింగ్ మార్గాల నిర్మాణం, 2,300 ప్రస్తుత మార్గాల పునరుద్ధరణ చేపట్టనున్నారు. 2024లో దుబాయ్ లో 216,500 చెట్లను నాటడం ద్వారా 17 శాతం గ్రీనరి పెరిగింది. దాంతో ఎమిరేట్ పచ్చని ప్రదేశాలు కూడా 391.5 హెక్టార్లకు విస్తరించాయి. 2023తో పోల్చుకుంటే ఇది 57 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







