డ్రగ్ వ్యాపారి మెహదీ చరఫాను ఫ్రాన్స్‌కు అప్పగింత..యూఏఈ

- February 08, 2025 , by Maagulf
డ్రగ్ వ్యాపారి మెహదీ చరఫాను ఫ్రాన్స్‌కు అప్పగింత..యూఏఈ

యూఏఈ: డ్రగ్ వ్యాపారి ఫ్రెంచ్ జాతీయుడు మెహదీ చరఫాను ఫ్రాన్స్‌కు అప్పగించనున్నట్లు యూఏఈ అధికారులు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ సంబంధించి అనేక కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. చరఫాను ఫ్రాన్స్ కు అప్పగించేందుకు ఫెడరల్ సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. అంతకుముందు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ణయాన్ని సమర్థించింది.జనవరి 14న జరిగిన సెషన్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం నిందితుడి అప్పీల్‌ను తిరస్కరించింది. అప్పగింతకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.యూఏఈ-ఫ్రాన్స్ మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించి మే 2, 2007న ఒప్పందం జరిగింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com