తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమం
- July 01, 2016
తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం పునుకుడు చెలక గ్రామం వద్ద హరిత విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రక్షణశాఖ అధికారులు... కేంద్ర పౌరవిమానయాన శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌తో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ రక్షణ శాఖకు లేఖ రాసింది. దీంతో రక్షణశాఖ అధికారులు కొత్తగూడెం ప్రాంతాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. రక్షణ పరంగా ఎలాంటి సమస్యలు లేదని తేల్చారు. విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని .. రక్షణ శాఖ విమానాలు, హెలికాప్టర్లు నిలిపేందుకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని సూచించారు. విమానాశ్రయంలో రేడియో నావిగేషన్‌తో పాటు ఇతర వసతులు ఉండాలని సూచించారు. రక్షణ శాఖ అనుమతి రావడంతో త్వరలోనే పౌరవిమానయాన శాఖ, హోంశాఖల నుంచి అనుమతి వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పునుకుడు చెలక వద్ద భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేసిన అధికారులు... విమానాశ్రయానికి అవసరమైన మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







