ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..
- February 09, 2025
కటక్: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా అక్షర్ పటేల్(41 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (44) లు రాణించారు. విరాట్ కోహ్లీ (5) విఫలం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ సాధించారు.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు శుభారంభం ఇచ్చారు. చాలా కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







