‘ఇట్స్ కాంప్లికేటెడ్' నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ: సిద్ధు జొన్నలగడ్డ
- February 09, 2025
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కాంప్లికేటెడ్'గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘ఇట్స్ కాంప్లికేటెడ్' సినిమా నాకు చాలా స్పెషల్. పాండమిక్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో అనే ఆసక్తి వుండేది. ఈ మూవీ జర్నీలో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. రవితో కొలాబరేషన్ ఎప్పుడూ కొత్తగా వుంటుంది. థియేటర్లలో విడుదల చేయలేకపోయమన్న బాధ నాకు, రవికాంత్‌కు ఎప్పుడూ ఉండేది. ఈ మూవీ రీ రిలీజ్ కోరుతూ అభిమానులు కొందరు రవికాంత్‌కు సోషల్ మీడియాలో మెసేజ్ చేసేవారు. వాటిని చూశాక.. నాకూ ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. రానాకు చెబితే తక్కువ సమయంలోనే రిలీజ్ ప్లాన్ చేశారు. థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చుడాలనే ఎక్సయిట్మెంట్ వుంది. అప్పటి కంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రిలవెంట్ అనిపిస్తోంది.' అన్నారు.
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇట్స్ కాంప్లికేటెడ్.. ప్రతి మనిషి జీవితంలో ఎదో కాంప్లికేషన్ వుంటుంది. నా జీవితంలో డైరెక్టర్ రవికాంత్, తర్వాత సిద్దు కాంప్లికేటెడ్(నవ్వుతూ). రవికాంత్ చెప్పిన కథ మనసుకు చాలా దగ్గరగా వుంది. అందరి జీవితంలో అది జరుగుతుంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. నిజానికి సిద్ధు, రవికాంత్ తో మరో సినిమా చేయాలని వుంది..ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తేగానీ కొత్త చిత్రం చేయనన్నారు. నాకు మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా. (నవ్వుతూ). చాలా ప్రేమతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా థీం చాలా ఫ్రెష్ గా వుంటుంది. బిగ్ స్క్రీన్స్ లో ఆడియన్స్ రియాక్షన్ చూడాలనే ఎక్సయిట్మెంట్ వుంది' అన్నారు.
డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ..ఇట్స్ కాంప్లికేటెడ్ థియేటర్స్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. సిద్దు ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. కేవలం రానా గారే ఇలాంటి సినిమాలని నిర్మించగలరు. ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను'అన్నారు
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఇది మాకు బిగ్ మూమెంట్. సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు
హీరోయిన్ సీరత్ కపూర్ మాట్లాడుతూ.. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. యునిక్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే. కరోనా సమయంలో సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోయాం. ఇప్పుడు సినిమా థియేటర్స్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఇది మెమరబుల్ ఎక్సపీరియన్స్. ఇదొక మ్యజికల్ మూవీ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







