హాలీవుడ్ సినిమాకి జగపతి వాయిస్!
- July 01, 2016
కథానాయకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న జగపతిబాబు ప్రతినాయకుడిగా కూడా చక్కగా ఆకట్టుకుంటున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్న ఆయన తాజాగా ఓ హాలీవుడ్ చిత్రానికి వాయిస్‌ను అందించటం విశేషం.
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తాజాగా తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం బీఎఫ్జీ 'ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్' శుక్రవారం అమెరికాలో విడుదలైంది. ఈ చిత్రాన్ని భారత్‌లోనూ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. జులై 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మూడు తెలుగు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. 'నువ్వు వూహించిన దాని కంటే ఈ ప్రపంచము చాలా పెద్దది' అంటూ పోస్టర్లపై ఉన్న అక్షరాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఈ చిత్రానికి గాత్రం అందించారు. రచయిత రోల్డ్ దాల్ రాసిన బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







