ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి: వంశీ రామరాజు

- February 11, 2025 , by Maagulf
ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి: వంశీ రామరాజు

ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి
                            -- వంశీ రామరాజు
                             

హైదరాబాద్: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘంటసాల గుడిలో హైదరాబాదుకు చెందిన శ్రీ గిరి రాగ స్రవంతి వారి' గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భముగా మానవుడే మహనీయుడ -తెలుగు పాటకు పట్టాభిషేకం' అనే పేరు తో సినీ సంగీత కార్యక్రమాన్ని సమర్పించారు.గాయనీగాయకులు రామకృష్ణ,శ్రీకాంత్ ,నాగభూషణం,ఇందునయిన, వీణ ఘంటసాల పడిన అనేక చిత్రాలలోని పాటలతో వీనులవిందు చేశారు.ఈ సందర్భముగా ఘంటసాల గుడి ధర్మకర్త కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ 'ఘంటసాల నిర్యాణం చెంది 51 సంవత్సరాలు దాటినా వారి పాటలు అజరామరంగా ఉన్నాయనీ, భారత ప్రభుత్వం వారికి 'భారత రత్న' పురస్కారం ఇచ్చి గౌరవించవలసిందని అన్నారు.ముఖ్యఅతిధిగా పి.వంశీ కృష్ణ, భారతీయ జనతా పార్టీ , సిటీ ఈసీ మెంబెర్ పాల్గొని ఘంటసాల వాగ్గేయకారుడు అని సద్గురువు అని, ఆయన పాట ద్వారా ఎంతోమంది గాయనీగాయకులు కుఉపాధి దొరికింది అని, వారు కీర్తిశేషులై 51 సంవత్సరాలైన వారు పాడిన భగవద్గీత ఎందరినో ప్రభావితం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి సమన్వయం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com