విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

- February 12, 2025 , by Maagulf
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ: విజయవాడలో ఇవాళ‌ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సితార సెంటర్ లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. లోపల గ్యాస్​ సిలిండర్​ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం తెలుసుకున్న భవానీపురం పోలీసులు హుటాహుటిన ఎగ్జిబిషన్ ప్రాంతానికి చేరుకొని ఫైర్ సిబ్బందితో కలసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com